నగదు లాక్కుందామనుకున్నారు.. కానీ..
* దొరికిపోయి తన్నులు తిన్నారు..!
* పోలీసుల అదుపులో ఇద్దరు చోరులు
బాపట్ల: బాపట్ల స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద గురువారం మహిళ వద్ద నగదును చోరీ చేయడానికి ప్రయత్నించి ఇద్దరు దొరికిపోయారు. బ్యాంకు వద్ద బాగా రద్దీగా ఉండడాన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు ఒక మహిళ చేతిలో ఉన్న నగదును లాక్కునేందుకు యత్నించారు. ఆ మహిళ కేకలు వేయడంతో క్యూలో ఉన్న వారు వెంటనే నిందితుని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అతనితో పాటు ఉన్న మరో వ్యక్తిని కూడా పట్టుకుని అక్కడే ఉన్న పోలీసులకు ఇద్దరినీ అప్పగించారు. పోలీసులు విచారించగా ప్యాడిసన్‌పేటకు చెందిన వ్యక్తులుగా చెప్పారు. అయితే వారు ఆ ప్రాంతానికి చెందిన వారు కాకపోవడంతో విచారణ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.