
పోలీసులకు చిక్కిన దొంగలు
చౌటుప్పల్ (మునుగోడు) : దొంగలు చేతివాటాన్ని ప్రదర్శించారు. శుభకార్యాల్లోకి ప్రవేశించి పని చేసుకుపోయారు. పెద్ద ఎత్తున నగదు చోరీ చేశారు. ఈ ఘటన శుక్రవారం మండలంలోని లక్కారం, చౌటుప్పల్‌లో చోటు చేసుకుంది.నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ముగ్గురు, డిండికి చెందిన మరో యువకుడు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వివిధ ప్రాంతాల్లో çసంచరిస్తూ అనువైన ప్రాంతాలను గుర్తించి చోరీలకు పాల్పడుతుంటారు. అందులో భాగంగా శుక్రవారం చౌటుప్పల్ ప్రాంతంలో చోరీకి పాల్పడ్డారు. ముందుగా లక్కారం గ్రామంలోని ఎంఆర్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన ఓ పెళ్లికి వెళ్లారు.
భోజనాల సమయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆదమర్చి ఉన్న అక్కడి వ్యక్తుల జేబులకు చిల్లు వేశారు. పని ముగించుకుని సాఫీగా అక్కడి నుంచి వెనుతిరిగారు. అనంతరం మండల కేంద్రంలో జరుగుతున్న వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ భోజనాల వద్దకు వెళ్లి జనంలో చొరబడ్డారు. చేతివాటం ప్రదర్శిస్తుండగా యువకులు పట్టుకోబోయారు. దీంతో అక్కడి నుంచి నలుగురు దొంగలు పారిపోబోయారు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తమయ్యారు. దొంగల వెంటపడి పట్టుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రెండు ఘటనల్లో 12మంది బాధితుల వద్ద లక్షా 20 వేల రూపాయల వరకు దొంగలు అపహరించారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వెంకటయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment