చిత్తూరు: దోపిడీ దొంగలు చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టించారు. గంగవరం మండలం నల్లసానిపల్లిలో 20 మంది దొంగలు చొరబడి నానా రభస చేశారు. కాగా, ఇద్దరు దొంగలను గ్రామస్తులు పట్టుకున్నారు. పోలీసులు రావడంతో దొంగలు ఇళ్లలోకి చొరబడ్డారు. మరోపక్క, విద్యుత్ కోత కారణంగా చీకటి సమయంలో దొంగల అలజడి నెలకొనడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.