హైదరాబాద్: ఐదేళ్ల కిత్రం పరిచయం వారిద్దరిని ఒకటి చేసింది. దైవసాక్షిగా ఆ అమ్మాయి మేడలో మూడు ముళ్లు వేశాడు. అయితే తాను పెళ్లి చేసుకున్న విషయం ఇంట్లో దాచి తన మామ కూతురితో మరో పెళ్లి చేసుకున్నాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిని అరెస్టు చేశారు. చిక్కడపల్లి పోలీసులు తెలిపిన వివరాలివీ.. దోమలగూడ బండానగర్ లో నివసిస్తున్న ఓ యువతి (27)తో, నగరంలోని ఓ ప్రముఖ బంగారం దుకాణంలో పని చేస్తున్న బీదర్‌కు చెందిన సంగమేష్ (26)కు ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. గత మే 5వ తేదీన వీరిద్దరూ యాదగిరి గుట్టలో వివాహం చేసుకుని హైదరాబాద్‌కు వచ్చారు.
ఆ తరువాత తన స్వగ్రామం వెళ్లి వస్తానని చెప్పిన సంగమేష్ అక్కడికి వెళ్లి తన మామ కూతురిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయంచింది. దీంతో పోలీసులు సంగమేశ్వర్‌ను అరెస్ట్ చేసి అతనిపై 420, 426 ఎస్సీ, ఎస్టీ ట్రాసిటీ కేసులను నమోదు చేసి గురువారం రిమాండ్‌కు పంపారు.
ముందు ప్రేమ పెళ్లి... మామ కూతురితో మరో పెళ్లి!
Published Thu, Jun 2 2016 10:21 PM | Last Updated on Mon, Sep 4 2017 1:30 AM
Advertisement
Advertisement