గ్యాస్ సిలిండర్‌పై వ్యాట్ తగ్గించండి
పౌరసరఫరాల శాఖ సిఫార్సు
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్‌తో వినియోగదారుల పై అదనంగా పడుతున్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్) భారాన్ని తగ్గిం చేందుకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆధార్ నంబర్‌తో అనుసంధానం అయిన విని యోగదారుల ఖాతాలో రూ.388 జమ కావాల్సి ఉన్నా, రూ.369.53 మాత్రమే జమ అవుతోంది. వ్యాట్ రూ.39.64గా ఉండడంతో రూ.18.47 మేర తక్కువగా జమ అవుతోంది. అదే ఆధార్ నమోదుచేసుకోని వారికి ప్రస్తుతం రాయితీ ద్వారా అందిస్తున్న సిలిండర్ ధర రూ.444.50 ఉండగా, అందులో వాస్తవ ధర 423.33, వ్యాట్ రూ.21.17గా ఉంది. ఇలా వ్యాట్ వ్యత్యాసం రూ.18.47 మేర ఉంది. దీంతో పౌరసరఫరాల శాఖ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భా రాన్ని తగ్గించేలా నిర్ణయం చేయాలని కోరింది.