telangana Civil Supplies Department
-
‘రేషన్’ పాట్లు..
ఇల్లెందు(అర్బన్) : మండల పరిధిలోని పూబెల్లిలో ఎటువంటి సెల్ సిగ్నల్స్ లేకపోవడంతో చౌకదుకాణానికి పంపిణీ చేసిన ఈపాస్ యంత్రాలు పనిచేయడంలేదు. పదిహేను రోజులుగా డీలర్ వివిధ ప్రయత్నాలు చేసినా ఎంతకీ ఫలితం లేకుండా పోయింది. 1వ తేదీ నుంచి 15 లోపు సరుకుల పంపిణీ చేయాల్సిన డీలర్ 15నాటికి ఒక్కరికి కూడా సరుకులు పంపిణీ చేయలేకపోయారు. ఈ దుకాణం పరిధిలో సుమారు 378 తెల్ల రేషన్, అంత్యోదయ కార్డు వినియోగదారులు ఉన్నారు. విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలియజేశారు. సిగ్నల్స్ పని చేయకపోతే తాము సరుకులు పంపిణీ చేసేదేలాని అధికారులను ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా ఇటీవల రెండు రోజుల క్రితం రికార్డుల్లో వినియోగదారుల వివరాలను నమోదుచేసుకొని పరుకుల పంపిణీ ప్రక్రియను షురూ చేశారు. ఈ విషయం చాలా మంది వినియోగదారులకు తెలియకపోవడంతో సరుకులు తీసుకోలేదు. స్టాక్ దుకాణంలోనే నిల్వ ఉంది. ఎలా పంపిణీ చేయాలో తెలియక డీలర్ సతమతమవుతున్నారు. అధికారులు మాత్రం మూడు రోజుల్లో సరుకుల పంపిణీ పూర్తి చేయాలని డీలర్‌కు ఆదేశాలు జారీ చేశారు. బయో మెట్రిక్ ద్వారా కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ప్రతి నెలా ఇలాగైతే తాము సకాలంలో సరుకులు తీసుకోవడం సాధ్యం కాదని గ్రామస్తులు అంటున్నారు -
గ్యాస్ సిలిండర్‌పై వ్యాట్ తగ్గించండి
పౌరసరఫరాల శాఖ సిఫార్సు సాక్షి, హైదరాబాద్: సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్‌తో వినియోగదారుల పై అదనంగా పడుతున్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్) భారాన్ని తగ్గిం చేందుకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆధార్ నంబర్‌తో అనుసంధానం అయిన విని యోగదారుల ఖాతాలో రూ.388 జమ కావాల్సి ఉన్నా, రూ.369.53 మాత్రమే జమ అవుతోంది. వ్యాట్ రూ.39.64గా ఉండడంతో రూ.18.47 మేర తక్కువగా జమ అవుతోంది. అదే ఆధార్ నమోదుచేసుకోని వారికి ప్రస్తుతం రాయితీ ద్వారా అందిస్తున్న సిలిండర్ ధర రూ.444.50 ఉండగా, అందులో వాస్తవ ధర 423.33, వ్యాట్ రూ.21.17గా ఉంది. ఇలా వ్యాట్ వ్యత్యాసం రూ.18.47 మేర ఉంది. దీంతో పౌరసరఫరాల శాఖ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భా రాన్ని తగ్గించేలా నిర్ణయం చేయాలని కోరింది.