విశాఖలో సిలిండర్ పేలుడు : ఒకరు మృతి | 2 killed, 20 Injured In Gas Cylinder Explosion In Visakhapatnam city | Sakshi
Sakshi News home page

విశాఖలో సిలిండర్ పేలుడు : ఒకరు మృతి

Published Tue, Dec 9 2014 10:14 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

విశాఖలో సిలిండర్ పేలుడు : ఒకరు మృతి

విశాఖలో సిలిండర్ పేలుడు : ఒకరు మృతి

విశాఖపట్నం: విశాఖపట్నం నగరంలోని పూర్ణ మార్కెట్ సమీపంలోని రంగ్రీజు వీధిలో ఓ ఇంట్లో మంగళవారం గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నెలల పసికందు మరణిచింది. మరో18  మంది తీవ్రంగా గాయపడ్డారు. పేస్థానికులు వెంటనే అగ్నిమాపకశాఖ, పోలీసులకు సమాచారం అందించారు.

వారు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురు శరీరాలు పూర్తిగా కాలిపోయాయి. మరో నలుగురికి తీవ్రంగా గాయలయ్యాయని... వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. సిలిండర్ పేలుడులో ఇల్లు కుప్పకూలింది. పోలీసులు స్థానికులతో కలసి సహాయక చర్యల చేపట్టారు. పేలుడు శబ్దానికి స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement