విశాఖ:ఈనెల 9వ తేదీన నగరంలోని పూర్ణ మార్కెట్ సమీపంలో రంగిరీజు వీధిలో సంభవించిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. మంగళవారం పకోడీల వ్యాపారి సూరిబాబు సెవెన్స్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించడంతో నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు.