పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గంగరపర్రు గ్రామంలో వంట గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు గాయాలపాలయ్యారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గంగరపర్రు గ్రామంలో వంట గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు గాయాలపాలయ్యారు. సోమవారం ఉదయం వంట చేసేందుకు గ్యాస్ పొయ్యి వెలిగించగా అది లీకై మంటలు లేచాయి. అనంతరం సిలిండర్ పేలి ఇల్లు దెబ్బతినంటంతోపాటు ఇంట్లో ఉన్న ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను పాలకోడేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.