
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తుందని, ఇందుకోసం డాక్యుమెంట్లు తీసుకుంటోందని వస్తున్న వదంతులతో ఐదు రోజులుగా వినియోగదారులు ఉదయం 6 గంటలకే ఆయా గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కడ్తున్నారు.

హైదరాబాద్‌సహా అన్ని జిల్లాల్లో పనులన్నీ పక్కనబెట్టి గ్యాస్ పాస్బుక్కు, ఆధార్ కార్డులతో గంటల తరబడి లైన్లలో నిల్చుంటున్నారు.
















