గ్యాస్ సిలిండర్‌లో నీళ్లు చూపిస్తున్న వినియోగదారుడు కాయ శ్రీను
ఇచ్ఛాపురం: వంట చేద్దామని గ్యాస్ స్టౌ వెలిగిస్తే ఎంతకీ మంట పుట్టకపోగా, అనుమానంతో పరిశీలించగా సిలిండర్‌లో నీళ్లు ఉండటాన్ని చూసి ఓ వినియోగదారుడు అవాక్కయ్యాడు. పట్టణంలోని కొండివీధిలో గురువారం కాయ శ్రీను అనే వినియోగదారుడు తన ఇంట్లో ఇండియన్ గ్యాస్ సరఫరా చేసిన సిలిండర్‌ను స్టౌవ్‌కు అనుసంధానించి వెలిగించే ప్రయత్నం చేశాడు.
ఎప్పటికీ మంట పుట్టకపోవడంతో అనుమానం వచ్చి నిశితంగా పరిశీలించాడు. ఈ మేరకు సిలిండర్‌ను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి నీళ్లు ఉన్న వైనాన్ని స్థానికులకు చూపించాడు. ఈ విషయమై స్థానిక గ్యాస్ ఏజెన్సీకి ఫిర్యాదు చేయడంతో దానికి బదులుగా మరొక సిలిండర్‌ను అందజేశారు.
ఇటీవల ఇదేవీధికి చెందిన సంతోష్ అనే విని యోగదారుడికి, గిలాయివీధిలో మరో వినియోగదారునికి ఇదే అనుభవం ఎదురవడంతో ఏజెన్సీకి ఫిర్యాదు చేయడం గమనార్హం.
ఈ విషయమై స్థానిక ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వజ్రపు వెంకటేష్‌ను ప్రశ్నించగా సాంకేతిక కారణాల వల్ల ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఏదేమైనా వినియోగదారుడు నష్టపోకుండా వెం టనే సిలిండర్ మార్పు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment