గ్యాస్ సిలిండర్ పేలి మహిళ మృతి
Published Tue, Nov 22 2016 2:16 AM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM
పాలకోడేరు : వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఒక మహిళ మృతి చెందిన ఘటన ఇది. విస్సాకోడేరు పంచాయతీ పరిధిలోని వంకాయలపాలెంకు చెందిన బొల్ల సత్యనారాయణ భార్య లక్ష్మి (55) ఆదివారం రాత్రి వంట చేస్తుండగా.. ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబలెన్సులో భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ.. రాత్రి 1 గంట సమయంలో మృతి చెందింది. ఆమెకు భర్త, కుమార్తె ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్టేష¯ŒS హౌస్‌ఆఫీసర్ సూర్యనారాయణ తెలిపారు.
Advertisement
Advertisement