సిలిండర్ పేలి హోటల్ దగ్ధం | gas cylinder leakage causes hotel burnt | Sakshi
Sakshi News home page

సిలిండర్ పేలి హోటల్ దగ్ధం

Published Sun, Sep 6 2015 5:20 PM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

gas cylinder leakage causes hotel burnt

నిడదవోలు: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళ్లపాళెం గ్రామంలో ఆదివారం గ్యాస్ సిలిండర్ పేలి ఒక హోటల్ దగ్ధమైంది. మంగమ్మ అనే మహిళ స్థానికంగా హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నది. ఈ రోజు మధ్యాహ్నం హోటల్‌లోని గ్యాస్ సిండర్ లైకై ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

దీంతో హోటల్‌లో అల్పాహారం సేవిస్తున్నవారంతా భయంతో పరుగుతీశారు. అందరూ చూస్తుండగానే హోటల్ కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. గల్లాపెట్టెలో ఉన్న రూ.10వేల నగదు సహా మొత్తం రూ. 2.5లక్షల ఆస్థినష్టం సంభవించడంతో యజమానురాలు మంగమ్మ కన్నీరు మున్నీరుగా విలపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement