సబ్సిడీయేతర గ్యాస్ ధర రూ.113 తగ్గింపు
న్యూఢిల్లీ: సబ్సిడీయేతర వంట గ్యాస్ సిలెండర్ ధరను కేంద్ర ప్రభుత్వం రూ. 113 తగ్గించింది. దీంతో 14.2 కేజీల సిలిండర్ ధర రూ. 865 నుంచి రూ. 752కి తగ్గింది. అంతర్జాతీయ ధరల తగ్గింపుతో ఈ నిర్ణయం తీసుకుంది. సబ్సిడీయేతర లేదా మార్కెట్ ధరల ఎల్పీజీ సిలెండర్ ధర తగ్గించడం ఇది ఐదోసారి. ఐదు పర్యాయాలు ధర తగ్గించడంతో వంటకు వినియోగించని గ్యాస్ సిలెండర్ ధర రూ.170.5 తగ్గి మూడేళ్ల కనిష్టస్థాయికి చేరుకుంది.
జెట్ ఇంధనం(ఏటీఫ్) ధరను కిలోలీటర్ కు 4.1 శాతం(రూ.2,594.93) తగ్గించింది. దీంతో ఏటీఫ్ ధర కిలోలీటర్ కు రూ. 59, 943కు చేరింది.