ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి మంటలు అంటుకుని గుడిసె కాలిపోయింది.
అల్లాదుర్గం(మెదక్): ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి మంటలు అంటుకుని గుడిసె కాలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బిజిలిపూర్ గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన రాయికొటి నాగయ్య గ్రామ శివారులో ఉన్న తన పొలం వద్ద గుడిసె వేసుకుని అక్కడే ఉంటున్నాడు. వంట చేసుకోవడానికి గుడిసెలో గ్యాస్ సిలిండర్ కూడా ఉంది. గురువారం పొలం పనులు చేసుకునేందుకు నాగయ్య వెళ్లగా షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి గ్యాస్ సిలిండర్ పేలి, గుడిసె కాలిపోయింది. ఈ ప్రమాదంలో రూ.లక్ష వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు.