గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి గాయాలు | 4 people injured in cylinder blast incident in karimnagar district | Sakshi
Sakshi News home page

గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి గాయాలు

Published Wed, Apr 29 2015 5:55 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

గ్యాస్ సిలిండర్ వెలిగించడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు పేలడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

కరీంనగర్: గ్యాస్ సిలిండర్ వెలిగించడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు పేలడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం మామిండ్లవాడ గ్రామంలో బుధవారం మధ్యాహ్నాం జరిగింది. గ్రామానికి చెందిన మహమ్మద్ మతిన్ ఇంట్లో ఈ ప్రమాదం సంభవించింది. సిలిండర్ పేలిన సమయంలో ఇంట్లో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

సిలిండర్ పేలుడికి ఆ ఇల్లు పూర్తిగా ధ్వసం అవడమే కాక చుట్టు పక్కల ఐదు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ గ్రామస్తులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement