గ్యాస్‌ సిలిండర్‌ పేలి.. ముగ్గురు మృతి | 3 dies as Gas Cylinder blast in karnataka | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సిలిండర్‌ పేలి.. ముగ్గురు మృతి

Published Wed, May 17 2017 4:41 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

గ్యాస్‌ సిలిండర్‌ పేలి.. ముగ్గురు మృతి - Sakshi

గ్యాస్‌ సిలిండర్‌ పేలి.. ముగ్గురు మృతి

వైట్‌ఫీల్డ్(బెంగళూరు) :
ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్ పేలడంతో ఒకే కుంటంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. నగరంలోని మహదేవపుర నియోజకవర్గం వినాయక లేఅవుట్‌ సమీపంలోవున్న కావేరీ నగర్‌లో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. మహదేవ పుర ఎస్‌ఐ నారాయణస్వామి తెలిపిన వివరాలు.. ఒడిస్సాకు చెందిన ప్రశాంత కుమార్‌(36), భార్య బసంతిలత (30), కొడుకు ఆదిత్య(9), కూతురు మౌనిషా(2)లు కావేరి నగర్‌లో నివాసం ఉంటున్నారు. ప్రశాంత కుమార్‌ ఐటిపిఎల్‌ ప్రాంతంలోని ఒక ప్రైవేటు కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.

ఈనెల 12న రాత్రి బసంతిలత పాలను వేడిచేయడానికి స్టౌవ్‌మీద పెట్టి మరచిపోయి నిద్రపోయింది. పాలు పొంగి స్టౌవ్‌ ఆరిపోవడంతో.. గ్యాస్‌ లీకైంది. మరుసటి రోజు తెల్లవారు జామున ప్రశాంత కుమార్‌ టీ పెట్టడానికి స్టౌవ్‌ను లైటర్‌తో వెలిగించాడు. దీంతో వెంటనే గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో ప్రశాంతకుమార్‌తోపాటు అతని భార్య బసంతి లత, కూతురు, కొడుకులు తీవ్రంగా కాలి.. గాయపడ్డారు. వారి అరుపులు విన్న చుట్టుపక్కల ఇళ్లవారు వచ్చి వారిని 108 వాహనంలో విక్టోరీయా ఆసుపత్రిలో చేర్పించారు.

ఆసుపత్రితో చికిత్స పొందుతూ ఈనెల 14న ప్రశాంతకుమార్‌ మృతి చెందాడు. మరుసటి రోజు అతని కూతురు మౌనిషా, కొడుకు ఆదిత్యలు చనిపోయారు. అతని భార్య బసంతి లత ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. మృతి చెందిన ప్రశాంతకుమార్, అతని బిడ్డల మృతదేహాలను ఒడిస్సాలోని వారి బంధువులకు అప్పగించి... కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నారాయణ స్వామి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement