సబ్సిడీ రావడం లేదా?
సిద్దిపేటకు చెందిన రాము గ్యాస్ సిలిండర్ బుక్ చేశాడు. బండ వచ్చింది. కానీ, రాయితీ డబ్బులు బ్యాంక్ ఖాతాలో పడలేదు. వారమైనా ఫలితం లేదు. డీలర్‌ను సంప్రదిస్తే బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని చెబుతున్నాడు. ఈ సమస్య ఒక్క రాముదే కాదు చాలామంది లబ్ధిదారులది!
సిద్దిపేట రూరల్: రాయితీ రహస్యాన్ని తెలుసుకోవాలంటే మీ చేతిలో ఉన్న మొబైల్‌ని ఉపయోగిస్తే సరిపోతుంది. ఇది వరకే బ్యాంక్ అకౌంట్ ఉన్నా.. మళ్లీ మరో ఖాతా తెరవాలన్నా ఆధార్‌నెంబర్ తప్పనిసరి. కొత్త అకౌంట్‌కు ఆధార్ నెంబర్ అనుసంధానం కావడంతో ఆ సమాచారం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ)కు వెళ్తుంది. దీంతో ఆటోమెటిక్‌గా రాయితీ పడే ఖాతా మారిపోతుంది. ఈ విషయం తెలియక ఎప్పుడూ పడే ఖాతాలోనే లబ్ధిదారులు చూసుకుంటుంటారు. మొబైల్‌లో ూ99ూ99ు నెంబర్‌కు డయల్ చేయాలి. వెంటనే మీ ఆధార్‌నెంబర్ అడుగుతుంది. దాన్ని ఎంటర్ చేసి కన్మాఫ్ చేయడానికి 1 నొక్కాలి. అంతే మీ ఆధార్‌నెంబర్ చూపిస్తూ.. అది ఏ బ్యాంక్‌కు అనుసంధానమైందో, చివరిసారి ఎప్పుడు రాయితీ పడిందో సమాచారం తెలియజేస్తుంది.
పాత ఖాతాలో రాయితీ కోసం..
కొత్తగా రాయితీ పడే బ్యాంక్ అకౌంట్‌లో కాకుండా గత ఖాతాలో నగదు పడాలనుకుంటే సదరు బ్యాంక్‌కు వెళ్లి ఆధార్‌కార్డు జిరాక్స్ ఇచ్చి ఖాతాకు అనుసంధానం చేయించుకోవాలి. అప్పటికే మరో అకౌంట్‌కు అనుసంధానం అయితే, ఎన్‌పీసీఐ సర్వర్‌కు ఎటాచ్ చేయమని రిక్వెస్ట్ చేయాలి.
లావాదేవీలు ఫెయిల్ అయితే.
ఎన్‌పీసీఐ నుంచి లబ్ధిదారుడి ఖాతకు పంపిన లావదేవి ఒక్కోసారి ఫెయిలైతే వెంటనే సంబంధిత బ్యాంక్‌ను సంప్రదించాలి. అవసరమనుకుంటే మళ్లీ ఆధార్‌నెంబర్‌ను అప్‌డేట్ చేయించుకోవాలి.
ఇబ్బందులు లేని భాష
భారత్, హెచ్‌పీ, ఇండేన్ గ్యాస్‌లో ఎదైనాసరే టోల్‌ఫ్రీ నెంబర్ 1800-23-33-555కు ఫిర్యాదుచేయవచ్చు. గ్యాస్ సమస్య అనగానే ముందుగా గృహిణికే ఇబ్బంది. కాల్‌సెంటర్ అంటే ఇంగ్లిష్‌లోనో.. హిందీలోనో మాట్లాడతారని వారు కంగారుపడుతుంటారు. దీంట్లో ఈ రెండిటితో పాటు ప్రధాన భారతీయ భాషలైన తెలుగు, కన్నడం, తమిళం, మలయాళంలో మాట్లాడే ప్రతినిధులు ఉంటారు. టోల్‌ఫ్రీకి కాల్‌చేసి 3 నొప్పి తెలుగుని ఎంపికచేసుకోవాలి.
ఆపై ఏ కంపెనీ గ్యాస్ సమస్య అనేది నంబర్ ద్వారా తెలియజేయాలి. ఇండేన్ గ్యాస్ కోసం 1, హెచ్‌పీ కోసం 2, భారత్ గ్యాస్ కోసం 3 బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత రాయితీ సమస్య అయితే 1, ఇతర సమస్యల కోసమైతే 2 నొక్కి వేచి ఉండాలి. సంబంధిత గ్యాస్ సంస్థ ప్రతినిధి మీతో మాట్లాడుతారు. మన సమస్య చెప్పి ఫిర్యాదు నంబర్(ఎస్‌ఆర్ నంబర్) తీసుకోవాలి. ఆ నంబర్ మన మొబైల్‌కు ఎస్సెమ్మెస్ వస్తుంది.
ఈ సమస్యలకు..
గ్యాస్ తూకం తగ్గిన, సీల్ లేకుండా వచ్చి ఇచ్చినా, నిర్ణీత సమయంలో డెలవరీ చే యకపోయినా, గ్యాస్ డీలర్ మోసం చేసినా కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. గ్యాస్‌కు సంబంధించిన ఎలాంటి సమస్య అయినా కాల్‌సెంటర్‌ను సంప్రదించవచ్చు.