నిజామాబాద్ జిల్లాలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోటగిరి మండలం వల్లభాపూర్‌లో మేకల రాజు అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
కోటగిరి: నిజామాబాద్ జిల్లాలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోటగిరి మండలం వల్లభాపూర్‌లో మేకల రాజు అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అతని ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. సుమారు రూ.2 లక్షల వరకు నష్టం కలిగినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.