తోటపల్లిగూడూరు : మండలంలోని వరిగొండలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనకు సంబంధించి నష్టపోయిన బాధితులకు అండగా ఉంటానని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి హామీ ఇచ్చారు. వరిగొండ పంచాయతీ దేవుడుమాన్యం కాలనీలో ఈ నెల 25న పూనమల్లి రాధయ్య పూరింట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో స్థానికుడు సిరాజ్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఎమ్మెల్యే కాకాణి బాధితులను పరామర్శించేందుకు శుక్రవారం వరిగొండకు వచ్చారు.
ముందుగా కాకాణి సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును అధికారులనడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ ప్రమాదంలో మృతి చెందిన సిరాజ్ ఇంటికెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సిలిండర్ పేలిన ప్రమాదంలో ఆర్థికంగా నష్టపోయిన రాధయ్య కుటుంబ సభ్యులను ఆదుకుంటామన్నారు. ప్రాణాలు కోల్పోయిన సిరాజ్ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామన్నారు. ఈ రెండు కటుంబాలకు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే ఆర్థిక సాయంతో పాటు వ్యక్తిగతంగా తన వైపు నుంచి అన్ని రకాల సహాయ, సహకారాలు అందజేస్తామని తెలిపారు. సిరాజ్ కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం అందజేయాలన్నారు.
ఈ ప్రమాదంలో గాయపడి వైద్యశాల్లో చికిత్స పొందుతున్న నాగభూషణమ్మ, కార్తీక్‌కు ప్రభుత్వమే వైద్యఖర్చులు భరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు చిల్లకూరు సుధీర్‌రెడ్డి, మండల కన్వీనర్ టంగుటూరు పద్మనాభరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మన్నెం చిరంజీవులగౌడ్, నాయకులు టంగుటూరు శ్రీనివాసులురెడ్డి, నెల్లిపూడి సునీల్‌కుమార్‌రెడ్డి, ఒబ్బారెడ్డి సురేష్‌రెడ్డి, పి.రామసుబ్బయ్య, అశోక్‌రెడ్డి, రామ్మూర్తి, సురేష్‌రెడ్డి, ఎన్.శ్రీనివాసులురెడ్డి, ఆర్.సురేంద్రరెడ్డి, జాకీర్, ప్రవీణ్‌కుమార్, తహశీల్దార్ రామలింగేశ్వరరావు, ఎంపీడీఓ సావిత్రమ్మ, ఆర్‌ఐలు రాజేష్, అబ్దుల్, సర్పంచ్ బొడ్డు రాజమ్మ పాల్గొన్నారు.
పొదలకూరు సమగ్ర అభివృద్ధికి కృషి
పొదలకూరు : పొదలకూరు మండల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పట్టణంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండేదన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత స్వయం గా కండలేరు సీపీడబ్ల్యూస్కీమ్‌ను పరిశీలిం చి ఒక ఫిల్టరు, ఒక విద్యుత్ మోటారును మరమ్మతు చేయించడంతో సమస్య తగ్గుముఖం పట్టిందన్నారు. మరో రెండు ఫిల్టర్లు, రెండు మోటార్లను మార్చడం జరుగుతుందన్నారు. దీంతో వేసవిలో పట్టణంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తవన్నారు.
పట్టణంలోని క్లస్టర్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు కానున్నాయన్నారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాల్సి ఉందన్నారు. వసతి గృహాల నిర్మాణం పూర్తిచేయించనున్నట్లు తెలిపారు. మండలంలోని అమ్మవారిపాళెం, ఆల్తుర్తి, కనుపర్తి తదితర గ్రామాలకు దక్షిణ కాలువ నుంచి సాగునీరు అందడం లేదన్నారు. అటవీశాఖ భూముల్లో కాలువ నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. భూసేకరణకు అనుమతులు లభించినా ప్రభుత్వం అటవీశాఖకు నిధులు చెల్లించాల్సి ఉందని తెలిపారు. దక్షిణ కాలువ అటవీ భూముల్లో కాలువ నిర్మాణం పూర్తయితే మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు.
పొదలకూరులో డిగ్రీ కళాశాల ఏర్పాటునకు సంబంధితశాఖ మం త్రితో మాట్లాడినట్లు తెలిపారు. సమావేశం లో పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, ఎంపీటీసీ సభ్యులు శశిధర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, సులోచన, పెంచలయ్య, ఎంపీడీఓ శ్రీహరి, పీఆర్, ట్రాన్స్‌కో ఏఈలు చంద్రశేఖర్, అమీర్‌జాన్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, నాయకులు వాకాటి శ్రీనివాసులురెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాసులురెడ్డి, చిల్లకూరు వెంకురెడ్డి, వూకోటి లక్ష్మీనారాయణ, యూసీ మస్తాన్‌రెడ్డి, ఆదూరు వెంకటసుబ్బయ్య, మస్తాన్, రామయ్య, అంకిరెడ్డి పాల్గొన్నారు.
బాధితులకు అండగా నిలుస్తా!
Published Sat, Dec 27 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM
Advertisement