Goverdhan Reddy
-
TSPSC: నేడు మళ్లీ సీఎం రేవంత్ సమీక్ష.. పరీక్షలు రీ షెడ్యూల్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. నేడు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్పీ)పై మరోసారి సీఎం రేవంత్ సమీక్ష చేయనున్నారు. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే, బోర్డులో ఉన్న మిగతా సభ్యులు కూడా నేడు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బోర్డు పూర్తి స్థాయి ప్రక్షాళన తర్వాతే నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. టీఎస్పీఎస్పీ పరీక్షలన్నింటినీ రీ షెడ్యూల్ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్ జరుగనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను టీఎస్పీఎస్పీ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు రాజీనామా పత్రం సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తదుపరి చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. రాజీనామాకు ముందు సీఎం రేవంత్‌రెడ్డిని జనార్ధన్‌రెడ్డి కలిశారు. కమిషన్‌కు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్లు తెలిసింది. ఈ భేటీ ముగిసిన వెంటనే జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేయడం గమనార్హం. -
బాధితులకు అండగా నిలుస్తా!
తోటపల్లిగూడూరు : మండలంలోని వరిగొండలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనకు సంబంధించి నష్టపోయిన బాధితులకు అండగా ఉంటానని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి హామీ ఇచ్చారు. వరిగొండ పంచాయతీ దేవుడుమాన్యం కాలనీలో ఈ నెల 25న పూనమల్లి రాధయ్య పూరింట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో స్థానికుడు సిరాజ్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఎమ్మెల్యే కాకాణి బాధితులను పరామర్శించేందుకు శుక్రవారం వరిగొండకు వచ్చారు. ముందుగా కాకాణి సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును అధికారులనడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ ప్రమాదంలో మృతి చెందిన సిరాజ్ ఇంటికెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సిలిండర్ పేలిన ప్రమాదంలో ఆర్థికంగా నష్టపోయిన రాధయ్య కుటుంబ సభ్యులను ఆదుకుంటామన్నారు. ప్రాణాలు కోల్పోయిన సిరాజ్ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామన్నారు. ఈ రెండు కటుంబాలకు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే ఆర్థిక సాయంతో పాటు వ్యక్తిగతంగా తన వైపు నుంచి అన్ని రకాల సహాయ, సహకారాలు అందజేస్తామని తెలిపారు. సిరాజ్ కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం అందజేయాలన్నారు. ఈ ప్రమాదంలో గాయపడి వైద్యశాల్లో చికిత్స పొందుతున్న నాగభూషణమ్మ, కార్తీక్‌కు ప్రభుత్వమే వైద్యఖర్చులు భరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు చిల్లకూరు సుధీర్‌రెడ్డి, మండల కన్వీనర్ టంగుటూరు పద్మనాభరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మన్నెం చిరంజీవులగౌడ్, నాయకులు టంగుటూరు శ్రీనివాసులురెడ్డి, నెల్లిపూడి సునీల్‌కుమార్‌రెడ్డి, ఒబ్బారెడ్డి సురేష్‌రెడ్డి, పి.రామసుబ్బయ్య, అశోక్‌రెడ్డి, రామ్మూర్తి, సురేష్‌రెడ్డి, ఎన్.శ్రీనివాసులురెడ్డి, ఆర్.సురేంద్రరెడ్డి, జాకీర్, ప్రవీణ్‌కుమార్, తహశీల్దార్ రామలింగేశ్వరరావు, ఎంపీడీఓ సావిత్రమ్మ, ఆర్ఐలు రాజేష్, అబ్దుల్, సర్పంచ్ బొడ్డు రాజమ్మ పాల్గొన్నారు. పొదలకూరు సమగ్ర అభివృద్ధికి కృషి పొదలకూరు : పొదలకూరు మండల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పట్టణంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండేదన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత స్వయం గా కండలేరు సీపీడబ్ల్యూస్కీమ్ను పరిశీలిం చి ఒక ఫిల్టరు, ఒక విద్యుత్ మోటారును మరమ్మతు చేయించడంతో సమస్య తగ్గుముఖం పట్టిందన్నారు. మరో రెండు ఫిల్టర్లు, రెండు మోటార్లను మార్చడం జరుగుతుందన్నారు. దీంతో వేసవిలో పట్టణంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తవన్నారు. పట్టణంలోని క్లస్టర్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు కానున్నాయన్నారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాల్సి ఉందన్నారు. వసతి గృహాల నిర్మాణం పూర్తిచేయించనున్నట్లు తెలిపారు. మండలంలోని అమ్మవారిపాళెం, ఆల్తుర్తి, కనుపర్తి తదితర గ్రామాలకు దక్షిణ కాలువ నుంచి సాగునీరు అందడం లేదన్నారు. అటవీశాఖ భూముల్లో కాలువ నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. భూసేకరణకు అనుమతులు లభించినా ప్రభుత్వం అటవీశాఖకు నిధులు చెల్లించాల్సి ఉందని తెలిపారు. దక్షిణ కాలువ అటవీ భూముల్లో కాలువ నిర్మాణం పూర్తయితే మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు. పొదలకూరులో డిగ్రీ కళాశాల ఏర్పాటునకు సంబంధితశాఖ మం త్రితో మాట్లాడినట్లు తెలిపారు. సమావేశం లో పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, ఎంపీటీసీ సభ్యులు శశిధర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, సులోచన, పెంచలయ్య, ఎంపీడీఓ శ్రీహరి, పీఆర్, ట్రాన్స్‌కో ఏఈలు చంద్రశేఖర్, అమీర్జాన్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, నాయకులు వాకాటి శ్రీనివాసులురెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాసులురెడ్డి, చిల్లకూరు వెంకురెడ్డి, వూకోటి లక్ష్మీనారాయణ, యూసీ మస్తాన్‌రెడ్డి, ఆదూరు వెంకటసుబ్బయ్య, మస్తాన్, రామయ్య, అంకిరెడ్డి పాల్గొన్నారు. -
వైవీయూ ఉద్యోగిపై టీడీపీ నేత దాడి
వైఎస్ఆర్ జిల్లా: తన సొంత కళాశాలలో లా ఎగ్జామ్స్ సెంటర్ ఇవ్వలేదని యోగి వేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామర్‌ను టీడీపీ నేత గోవర్థన్‌రెడ్డి దుర్భాషలాడిన ఘటన వెలుగులోకి వచ్చింది. టీడీపీ నేత గోవర్థన్‌రెడ్డి దుష్పవర్తనపై వైవీయూ రిజిస్ట్రార్‌కు అసిస్టెంట్ కంట్రోలర్ ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతపై తగు చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. టీడీపీ నేత వ్యవహారతీరుపై నిరసన వ్యక్తం చేస్తూ యూనివర్శిటీలో విధులను టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ బహిష్కరించారు. -
పాలనలో ప్రజల భాగస్వామ్యం
నిజామాబాద్ రూరల్ : పాలనలో ప్రజలను భాగస్వాములను చేసి అభివృద్ధికి బాటలు వేయడానికి సీఎం కేసీఆర్ ‘మన ఊరు- మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ మండలంలోని న్యాల్కల్లో జరిగిన మన ప్రణాళి క గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పా ల్గొని ప్రసంగించారు. గ్రామాలను అభివృద్ధి పర్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని, ప్రణాళికల ఆధారంగానే నిధులను మంజూరు చేయడం జరుగుతుందని తెలి పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నె రవేర్చడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగు లు వేస్తుందన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నిరుపేదలకు ఇళ్ల స్థలా లు ఇప్పించేందుకు తొలుత న్యాల్కల్ గ్రా మాన్నే ఎంపిక చేసుకున్నానని, నిరుపేదల కు ఇళ్ల స్థలాలు ఇచ్చి గృహ నిర్మాణానికి రూ. 3 లక్షల చొప్పున రుణాలు ఇప్పిస్తామ ని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు అండగా ఉంటుందని అన్నారు. నిజామాబాద్ మండలంలో రూ. 33 కోట్ల విలువ చేసే 198 పనులను గుర్తించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. న్యాల్కల్ గ్రామంలో జూనియర్ కళాశాల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో విద్యా ప్రమాణాలు మెరుగు పర్చేందుకు తనవంతు కృషిచేస్తామన్నారు. పన్నులు చెల్లిస్తేనే ప్రగతి సాధ్యం : జడ్పీ సీఈవో ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లించినప్పుడే ప్రగతి పనులు సాధ్యమవుతాయని గ్రామసభలో పాల్గొన్న జిల్లా పరిషత్ సీఈఓ రాజారాం అన్నారు.ప్రతి గ్రామంలో ప్రజలు 100 శాతం ఇంటిపన్నులు చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ‘మన ఊరు-మన ప్రణాళిక’ ద్వారా గ్రామాల సర్వతోముఖాభివృద్ధి చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో చేపట్టిన ‘మన ఊరూ-మన ప్రణాళిక’లను ప్రభుత్వానికి పంపుతామని సీఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సంజీవ్‌కుమార్, గ్రామ సర్పంచ్ సువర్ణ ఉమాపతి, ఎంపీటీసీలు భాగ్యలక్ష్మి, సాగర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ముష్కె సంతోష్, భీంగల్ మాజీ మండల అధ్యక్షులు రాంరెడ్డి, మాజీ సర్పంచ్ కూర గ ంగాదర్, సొసైటీ చైర్మన్ గంగాప్రసాద్, మోపాల ఎంపీటీసీ దండు నర్సయ్య, పాఠశాల హెచ్ఎం కొండ ఆశన్న, గ్రామ ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, బోర్గం ఎర్రన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.