ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్లు, 5 కిలోల ఎఫ్‌టీఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ) సిలిండర్‌ల రేటుకట్ చేస్తున్నట్లు తెలిపాయి.
సవరించిన ధరల ప్రకారం చమురు సంస్థలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.30.50 తగ్గించాయి. దిల్లీలోని ధరల శ్రేణి ప్రకారం కొత్త ధర 1764.50గా నిర్ణయించారు. ముంబయిలో రూ.1719గా ధర ఉంటుంది. చెన్నైలో రూ.1930, కోల్‌కతాలో రూ.1881గా ఉండనుంది. 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ ధరను రూ.7.50కు కట్ చేశారు. అయితే ఈ ధరలను క్రూడ్‌కంపెనీలు మార్చిలో పెంచిన విషయం తెలిసిందే. మారుతున్న ఇంధన ధరలు, అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్ లభ్యత వంటి పరిస్థితుల కారణంగా తాజాగా రేట్లను కట్ చేస్తున్నట్లు కంపెనీలు తెలిపాయి.
గృహ వినియోగదారులు వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను యథాతథంగానే 14.2 కేజీకు రూ.855గానే ఉంచినట్లు తెలిసింది. ఇటీవలే ఈ ధరను రూ.955 నుంచి రూ.100 తగ్గించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: సమస్య పరిష్కారానికి ఇరవై గంటల జూమ్‌కాల్
Comments
Please login to add a commentAdd a comment