
మంటలను అదుపు చేసేందుకు ప్రయత్రిస్తున్న స్థానికులు
జయపురం: నవరంగపూర్ జిల్లా తెంతులికుంఠి సమితి కమతా పంచాయతీ కుసిమి గ్రామంలో గాŠయ్‌స్ సిలిండర్ పేలి, అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక ప్రాథమిక పాఠశాల సమీపంలో జరిగిన ఈ ఘటనలో ధర్మేంద్ర సాగరియ ఇంట్లో విలువైన సంపద అంతా కాలి బూడిదయ్యింది. భారీ శబ్ధంతో మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వాళ్లు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించినా.. సిబ్బంది వచ్చేసరికే సర్వం బూడిదయ్యింది.
కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే ఇళ్లు అగ్నికి ఆహుతయ్యిందని స్థానికులు చెబుతున్నారు. ఆ సమయంలో లోపల ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. ఇంటికి సంబంధించిన పత్రాలు, ఇతర సామగ్రీ కాలిపోవడంతో ధర్మేంద్ర కుటుంబం రోడ్డున పడింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment