వంట గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగితే వినియోగదారునికి రూ. 40 లక్షలు బీమా కవరేజ్ ఉంది. అంతే కాకుండా సిలిండర్ పేలి బతికి బయట పడ్డ వారికి కూడా రూ. 30 లక్షల బీమా ఇవ్వాలని నిబంధన కూడా ఉంది. అయితే ఈ విషయం ఎంతమంది వంట గ్యాస్ వినియోగించే వినియోగదారులకు తెలుసనేది ప్రశ్న? ప్రమాదాలు జరిగిన వారికి ఇంధన కంపెనీలు ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చిన సందర్భాలున్నాయి? ఆలోచించాల్సిందే. వినియోగదారుడు గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే చాలు.. సదరు వినియోగదారుడు బీమాకు అర్హుడవుతాడు. ఈ విషయం గ్యాస్ కంపెనీలలో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు తెలియపోవడం విడ్డూరం.