వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్‌లీక్ అవడంతో ఇల్లు దగ్ధమయింది.
హైదరాబాద్: వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్‌లీక్ అవడంతో ఇల్లు దగ్ధమయింది. ఈ సంఘటన సికింద్రాబాద్ పరిధిలోని వారాసి గూడకు చెందిన సయ్యద్ రిజ్వాన్ ఇంట్లో చోటుచేసుకుంది. శనివారం ఉదయం రిజ్వాన్ భార్య పర్విన్ వంట చేస్తున్నప్పుడు ఒక్కసరిగా గ్యాస్ లీక్ అవడంతో మంటలు చెలరేగాయి. వెంటనే తేరుకున్న పర్విన్ తన ఇద్దరు పిల్లలతో ఇంట్లోంచి బయటకు పరుగు తీసింది. కొద్దిసేపట్లోనే మంటల ధాటికి పెద్ద శబ్ధం చేస్తూ గ్యాస్‌సిలిండర్ పేలడంతో ఇల్లు పూర్తిగా కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శకటం సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరిగలేదు ఇంట్లో ఉన్న లక్ష రూపాయల విలువైన ఫర్నీచర్ కాలి బూడిదయింది.