పేలిన గ్యాస్ సిలిండర్
Published Sat, May 6 2017 12:39 AM | Last Updated on Sat, Aug 11 2018 4:36 PM
– దాదాపు రూ. లక్ష వరకు ఆస్తి నష్టం
ఎమ్మిగనూరు రూరల్: కోటేకల్ గ్రామ మలుపు బస్టాండ్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసుకున్న టీ స్టాల్‌లో శుక్రవారం గ్యాస్ సిలిండర్ పేలింది. గ్రామానికి చెందిన గౌస్‌బాషా బస్టాప్ హైవే దగ్గర టీ స్టాల్, అందులో కిరాణం సరుకులను కూడ పెట్టుకొని నిర్వహిస్తున్నాడు. టీ చేస్తుండగా గ్యాస్ లీకు అవుతున్నట్లు గమనించి లీకును నివారించేందుకు గౌస్ ప్రయత్నించాడు. సమీపంలో ఉన్న వారంతా గమనించి దూరం పురుగులు తీశారు. ఇంతలోనే పెద్ద శబ్దంతో సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి.మంటల తాకిడికి పక్కన ఉన్న రెండు చెట్లు కాలిపోయాయి. పేలిన సిలిండర్ శకలాలు 200 మీటర్ల దూరం వరకు ఎగిరి పడ్డాయి. ఈ ప్రమాదంలో టీ స్టాల్ ఉన్న రూ. 15 వేల నగదు, సరుకులు, వస్తువులు పూర్తిగా మంటల్లో బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దాదాపు రూ. లక్ష వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు.
Advertisement
Advertisement