మహబూబ్‌నగర్: గ్యాస్ నింపుతుండగా సిలిండర్ పేలి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొత్తూరు మండలం కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరులో సిలిండర్ లో మిగిలి ఉన్న గ్యాస్ ను మరొక సిలిండర్ లో నింపుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనలో సంజయ్(8), భూమిక(10) అనే ఇద్దరు చిన్నారులతో పాటు మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సంజయ్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.