
గేట్స్ కాలేజీలో పేలిన గ్యాస్ సిలిండర్
గుత్తి : పట్టణ శివారులోని గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న క్యాంటీన్‌లో సోమవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ వం ట గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో క్యాంటీన్ నిర్వాహకుడు, పామిడి చెందిన వెంకటరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రత్యక్ష సాక్షులైన విద్యార్థులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో క్యాంటీన్ వంట గదిలో వెంకట రెడ్డి, విద్యార్థుల కోసం ఆమ్లేట్ వేస్తుండ గా హఠాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలిపోయింది.
రెగ్యులేటర్‌లో లోపం కారణంగా గ్యాస్ లీకై భారీ శబ్ధంతో విస్పోటం సంభవించింది. సిలిండర్ ముక్కలైంది. ఈ ఘటనతో కాలేజీలోని విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలేమి జరిగిందో కొంతసేపు ఎవ్వరికీ అర్థం కాలేదు. ప్రమాద సమయంలో క్యాంటీన్‌లోని వంట గది వద్ద ఉన్న సుమారు 60 మంది విద్యార్థులు అదృష్టవశాత్తు తప్పిం చుకున్నారు. దీంతో కాలేజీ నిర్వాహకు లు, అధ్యాపకులు ఊపిరి పీల్చుకున్నారు. నిర్వాహకుడు వెంకటరెడ్డి మాత్రం గాయపడ్డాడు.
భారీ విస్పోటంతో క్యాంటీన్ పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. క్యాంటీన్‌లోని ఫ్యాన్లు, ఫ్రిజ్, 16 బస్తాల బియ్యం, ఇంటి డాక్యుమెంట్లు, వాటర్, కూల్ డ్రి ం క్ బాటిళ్లతో పాటు రూ.20 వేల నగదు మంటల్లో మాడిపోయాయి. పేలుడు ధాటికి వంట గది పక్కన ఓ గది కూడా దెబ్బతినింది. సుమారు రూ.2 లక్షల విలువైన వస్తు, సామాగ్రి నాశనమైందని బాధితుడి భార్య వాపోయింది. కరస్పాండె ంట్ వీకే సుధీర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.