ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్ ఒక్కసారిగా పేలి మంటలు వ్యాపించాయి
సంతమాగూలూరు(ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొత్తరం గ్రామంలో గురువారం ఉదయం సిలిండర్ పేలి పూరిల్లు దగ్ధమైంది. మేస్త్రీగా పనిచేస్తున్న షేక్ ఇబ్రహీమ్ ఉదయం కూలీపనికు వెళ్లాడు. ఆయన భార్య ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్ ఒక్కసారిగా పేలి మంటలు వ్యాపించాయి. గమనించిన ఇరుగుపొరుగువారు ఇబ్రహీమ్ భార్యను ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చారు. దాంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.
పేలుడు దాటికి పూరిల్లు కుప్పకూలి దగ్ధమైంది. ఇంట్లో ఉన్న వస్తు సామాగ్రి మొత్తం కాలిపోయింది. ఈ సంఘటనలో దాదాపు రెండు లక్షల రూపాయల ఆస్థి నష్టం వాటిల్లిందని బాధితులు చెప్పారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.