ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నగరంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది.
లక్నో: ఉత్తరప్రదేశ్లోని అగ్రా నగరంలో బాలుగంజ్ ప్రాంతంలోని హోటల్ యజమాని బల్జిత్ సింగ్ ఇంట్లో శనివారం అర్థరాత్రి గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఆయన ఇద్దరి కుమార్తెలు మరణించారు. బల్జిత్ సింగ్ దంపతులతోపాటు మరో కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ సిలిండర్ పేలుడికి బల్జిత్ సింగ్ నివాసం కుప్పకూలింది. గ్యాస్ సిలిండర్ పేలుడుపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ పేలుడుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.