
ఎర్రుపాలెం(మధిర) : ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ హస్తం పేరుతో బియ్యంతో పాటు 9 రకాల వస్తువులను రేషన్ కార్డు లబ్దిదారులకు అందించామని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండల కేంద్రంలోని దూబకుంట్ల ఫంక్షన్ హాల్ నందు అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. మిగులు బడ్జెట్, అధిక రాబడి ఉన్న రాష్ట్రంలో అప్పుడిచ్చిన 9 రకాల వస్తువులను రేషన్ నుంచి తొలగించి కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. ధనిక రాష్ట్రంలో అంతకుముందు ఇచ్చిన 9 వస్తువులకు అదనంగా మరోరెండో, మూడో వస్తువులు కలిపి ఇవ్వాలి కానీ.. ఉన్నవి తొలంగించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ప్రత్యేక రాష్ట్రంలో.. పేదల పక్షాన
ప్రతిపక్షనాయకుడిగా ప్రభుత్వానికి డిమిండ్ చేస్తున్నా.. రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డు లబ్దిదారులకు బియ్యంతో పాటు 9 రకాల వస్తువులను తిరిగి అందించాలని అన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న మిగిలిన
రేషన్ కార్డులను మంజూరు చేయాలని మల్లు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment