
పర్చూరు: ‘అమ్మ విజయమ్మ కోసం పార్టీ రంగులతో సంచి తయారు చేశాను. మీ ద్వారా ప్రజాసంకల్పయాత్రలో అందజేయటానికి వచ్చాను’ అని రామనాథపురం గ్రామానికి చెందిన పుట్టంరాజు రామలక్ష్మమ్మ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తెలిపారు.
రేషన్ కార్డులు.. పింఛన్లు రాకుండా చేస్తున్నారు
ఉలవపాడు: తమకు రేషన్ కార్డులు, పింఛన్లు రానివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మల్కాపురం ఎస్టీ కాలనీకి చెందిన కావమ్మ, సీతమ్మ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద వాపోయింది. తాము వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశామని టీడీపీ నాయకులు తమను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని తెలిపింది. లోన్లు కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారంది. పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే జన్మభూమి కమిటీల సంతకాలు కావాలంటున్నారని..వారు పట్టించుకోవడంలేదని చెప్పింది.
న్యాయం చేయండి
ఒంగోలు వన్‌టౌన్: ‘వికలాంగులకు పర్సంటేజీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ నెలకు రూ. 2 వేలు పింఛన్ మంజూరు చేయాలి. ప్రతి వికలాంగుడికి ఉచిత బస్సు పాస్ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న 40 పర్సంటేజీని సవరించి 30 శాతంగా మార్చి మెడికల్ సర్టిఫికెట్ మంజూరుకు కృషి చేయాలి. ప్రభుత్వ పథకాల్లో వికలాంగులకు వేలిముద్రలను సడలించి.. ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ మంజూరయ్యే విధంగా చర్యలు చేపట్టాలి’ అంటూ తాళ్లూరు వికలాంగుల సంఘం ప్రెసిడెంట్ లోకిరెడ్డి సుబ్బారెడ్డి జగన్‌కు వినతిపత్రం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment