ప్రజల్లో సంతృప్తి శాతం పెరుగుతున్నట్లు సీఎం చంద్రబాబు చెబుతున్నా నిజానికి పెరుగుతోంది అసంతృప్తేనని రాష్ట్ర ప్రభుత్వ నివేదికలే వెల్లడిస్తుండటం గమనార్హం. అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగున్నరేళ్లలో ఆరుసార్లు జన్మభూమి–మా ఊరు కార్యక్రమాలను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ఖర్చు చేసిన టీడీపీ సర్కారు ప్రజల సమస్యలను తీర్చడంలో దారుణంగా విఫలమైనట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ నివేదిక స్పష్టం చేసింది.