ఒక్క గృహం కూడా మంజూరు చేయలేదు
► తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం
►అర్హులకు పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వడం లేదు
►గడపగడపలో వైఎస్సార్ సీపీ నేతలకు ప్రజల వినతి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం జిల్లాలో మంగళవారం గిద్దలూరు, కందుకూరు, యర్రగొండపాలెం, పర్చూరు, కనిగిరి నియోజకవర్గాల్లో నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను నాయకుల ఎదుట ఏకరువు పెట్టారు.
తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని నీటి సమస్య పరిష్కారానికి ట్యాంకర్లు పెంచాలని పెద్దదోర్నాల మండలం చినగుడిపాడు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మమ్మ, సీతమ్మతో పాటు పలువురు గడప గడప కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌కు విన్నవించారు.
నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, మురికి కాలువలు సైతం సక్రమంగా లేవని కనిగిరి పట్టణం 4వ వార్డు చింతలపాలెం, రామాలయం వీధికి చెందిన హుస్సేన్‌బీ, ఖాసీంబీ, గౌస్‌బీ తదితరులు వైఎస్సార్‌సీపీ కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్‌కు విన్నవించారు.
అధికారులకు వినతి పత్రాలిచ్చిన ఒక్క పక్కా గృహం మంజూరు చేయలేదని కందుకూరు పట్టణం 15వ వార్డు ఎర్రగుంటపాలేనికి చెందిన ఖాదర్‌బాషా, అబ్దుల్‌బాషాలతో పాటు పలువురు కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త తూమాటి మాధవరావుకు విన్నవించారు.
అర్హులకు పక్కా గృహాలు, రేషన్‌కార్డులు మంజూరు చేయలేదని, తాగునీటి కొళారుులు సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని చినగంజాం మసీదుపేటకు చెందిన షేక్ కాలేషా, షేక్ ఇసుబ్‌లతో పాటు పలువురు పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్‌కు విన్నవించారు.
గ్రామంలో అంతర్గత రోడ్లు లేదని, తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని గిద్దలూరు మండలం దంతెరపల్లి గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి, శివారెడ్డిలతో పాటు పలువురు గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఐ.వి.రెడ్డికి విన్నవించారు.