► టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో
► ఎమ్మెల్యేల సీరియస్
► అగ్రి జోన్ ఎత్తేయాలని డిమాండ్
► రేషన్ కార్డులు, పింఛను కోతలపై నిరసన
సాక్షి, విజయవాడ : టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ అంతర్గత సమావేశం సోమవారం వాడీవేడిగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలుఅంశాలపై ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందిం చారు. గ్రామాల్లోకి వెళితే ప్రజలు తమను నిలదీస్తున్నారని సీరియస్ అయ్యారు. అగ్రిజోన్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని స్పష్టంచేశారు. తక్షణం అగ్రిజోన్‌ను ఎత్తివేయించాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్, గద్దె రామ్మోహన్, శ్రీరాం తాతయ్య తదితరులు చెప్పినట్లు సమాచారం.
జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా మంచినీటి సమస్య ఎదురైందని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ, మచిలీపట్నం డివిజన్లను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. దీనిపై మంత్రి ఉమా స్పందిస్తూ గతంలో నాలుగు టీఎంసీల నీరు వది లితే ఒకటిన్నర టీఎంసీలు భూమిలోనే ఇంకిపోయిందన్నారు. మరో రెండు టీఎంసీల నీరు వదులుతామని హామీ ఇచ్చారు.
విమానాశ్రయ విస్తరణకు భూసేకరణ, ఏలూరు కాల్వ మళ్లింపు వ్యవహారంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే వంశీ తెలిపారు. రామవరప్పాడులో ఇన్నర్ రింగ్‌రోడ్డును పాకలు తొల గించకుండా డివైడర్ సైజు తగ్గించి కలిపే అవకాశాలను పరిశీలించి చర్చించేందుకు ఎన్‌హెచ్ రోడ్డు సేఫ్టీ విభాగం అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఇళ్ల తొలగింపు అనివార్యమైతే రామవరప్పాడు, ప్రసాదంపాడులలోనే నిర్మించి ఇవ్వాలన్నారు.
వేలిముద్రలు పడలేదని రేషన్ ఇవ్వకపోవడాన్ని పలువురు ఎమ్మెల్యేలు నిలదీశారు. ఈ-పోస్ విధానంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, తంగిరాల సౌమ్య, కాగిత వెంకట్రావ్, ఎమ్మెల్సీలు బాబూ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
జనంలోకి వెళితే.. నిలదీస్తున్నారు .
Published Tue, Mar 1 2016 2:02 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement