దండెత్తారు! | water problem in guntur | Sakshi
Sakshi News home page

దండెత్తారు!

Published Sat, Feb 13 2016 12:39 AM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM

దండెత్తారు! - Sakshi

దండెత్తారు!

తాగునీటి సమస్యపై గళమెత్తిన అధికార, విపక్షాలు
నిధులున్నా పట్టించుకోవడం లేదని ఆందోళన
ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈపై చర్యకు మంత్రి ప్రత్తిపాటి ఆదేశం
వాడి వేడిగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

 
 గుంటూరు వెస్ట్ : జిల్లావ్యాప్తంగా నెలకొన్న తాగునీటి సమస్యపై ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తమ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడిపై ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు ఉండి, ప్రతిపాదనలు పంపుతున్నా పట్టించుకోవడం లేదంటూ అధికారుల తీరుపై మండిపడ్డారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో     శుక్రవారం జెడ్పీ సర్వసభ్య   సమావేశంలో తాగునీటి సమస్యపై వేడి వేడిగా చర్చ జరిగింది. తాగునీటి సమస్యపై పార్టీలకు అతీతంగా సభ్యులు గళం విప్పడంతో ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ జి.శర్మపై క్రమశిక్షణ  చర్యలు తీసు కోవాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కలెక్టర్ కాంతిలాల్‌దండేను ఆదేశించారు.

జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే జెడ్పీ అక్కౌంట్స్ ఆఫీసర్ సీహెచ్.రవిచంద్రారెడ్డి 2016-17 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. జిల్లా ఆదాయ వనరులు, ఖర్చులు, మిగులు బడ్జెట్ తదితర అంశాలను సభలో చదివి వినిపించారు. సభ్యులందరూ ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం అజెండాలోని తొలి అంశమైన గ్రామీణ నీటి సరఫరాపై చర్చ ప్రారంభించారు.చుండూరు ఎంపీపీ ఉయ్యూరు అప్పిరెడ్డి మాట్లాడుతూ పంప్‌హౌస్ విద్యుత్ కనెక్షన్ నిమిత్తం ఏడాది క్రితం రూ.4.40 లక్షల డీడీ తీసి అధికారులకు అందజేశానని, నేటికీ కనెక్షన్ ఇవ్వలేదని మండిపడ్డారు. మాచర్ల జెడ్పీటీసీ ఎస్.గోపిరెడ్డి మాట్లాడుతూ ట్యాంకర్ల ద్వారా సరిపడ సరఫరా కావడం లేదన్నారు.పిడుగురాళ్ల జెడ్పీటీసీ వి.రామిరెడ్డి మాట్లాడుతూ కృష్ణానది నుంచి పిడుగురాళ్లకు తాగునీటి సరఫరా నిమిత్తం కోట్ల రూపాయలతో నిర్మించిన పైపులైన్ వృథాగా మారిందన్నారు. దానిని వెంటనే పూర్తిచేసి తాగునీరు సరఫరా జరిగేలా చూడాలని కోరారు.

అమృతలూరు జెడ్పీటీసీ చందోలు పృథ్వీలత మాట్లాడుతూ మండలంలోని ప్యాపర్రులో సరఫరా అవుతున్న తాగునీరు పచ్చరంగులో ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. దాచేపల్లి జెడ్పీటీసీ ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ జన్మభూమి కమిటీలోని సభ్యులను మార్చే అధికారం ఎవరికి ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఉన్నప్పటికీ, వారు లేరనే కారణంతో నలుగురు సభ్యుల్ని మార్చారని తెలిపారు. 6 నెలల నుంచి అడుగుతున్నప్పటికీ సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొల్లాపల్లి జెడ్పీటీసీ కిన్నెర సంతోషమ్మ మాట్లాడుతూ రెండేళ్ల నుంచి అడుగుతు న్నా సమస్యలను పరిష్కరించడం లే దన్నారు. తమ మండలానికి గుర్తింపు ఉందో లేదో చెప్పాలని కోరారు. బోర్లు వేసి నీటిని అందించాలని అన్నారు.  బెల్లంకొండ జెడ్పీటీసీ దేవళ్ల రేవతి మాట్లాడుతూ బెల్లంకొండ, రాజుపాలెంలోని పులిచింతల పునరావాస కేంద్రాల్లో  కనీస వసతులు కూడా అందడం లేదన్నారు. విద్యార్థులకు జెడ్పీ నుంచి అందిస్తున్న స్టడీ మెటీరియల్, పౌష్టికాహారం పంపిణీకి సంబంధించి సమాచారం ఉండడం లేదన్నారు.

దుగ్గిరాల జెడ్పీటీసీ యేళ్ల జయలక్ష్మి మాట్లాడుతూ అక్టోబర్ నుంచి నిర్మించుకున్న మరుగుదొడ్లకు బిల్లులు మంజూరుకాక లబ్ధిదారులు ఇబ్బందిపడుతున్నారని అన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement