శ్రీకాకుళం టౌన్:జిల్లాలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని జన్మభూమి గ్రామసభల్లో ప్రకటించి, మంజూరైన కార్డులను టీడీపీ నాయకుల చేతికి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ప్రశ్నించారు. ఈమేరకు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో కలె క్టర్ పి.లక్ష్మీనృసింహంనకు ఫిర్యాదు చేశారు. రాజాం నియోజకవర్గంలోని మగ్గూరు గ్రామంలో అరుుదుగురి రేషన్ కార్డులు సర్పంచ్ ఖగేంద్రవద్దే ఉంచుకొని లబ్ధిదారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తెలిపారు.
అలాగే, కొట్టిశ, మద్దివలస గ్రామాల్లో అంత్యోదయ కార్డులున్న లబ్ధిదారులకు మూడు నెలలుగా తెలుపు రేషన్ కార్డుదారులకు ఇచ్చేవిధంగా బియ్యం పంపిణీ చేస్తున్నారని, దీనివల్ల లబ్ధిదారులకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకాపల్లి పంచాయతీ కార్యదర్శి ఇంటిపన్ను వసూలు చేసి సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నట్టు ఫిర్యాదు చేశారు. ఫింఛనుదారుల నుంచి రూ.200 వంతున వసూలు చేసినట్టు ఆమెపై గతంలో గ్రామస్థులు ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనతోపాటు వైఎస్సార్‌సీపీ నాయకుడు సురేష్ ముఖర్జీ, వంజరాపు విజయ్, సిరిపురం జగన్ తదితరులు ఉన్నారు.
అంతకాపల్లి సెక్రటరీ సావిత్రి సస్పెన్షన్?
రాజాం నియోజకవర్గంలోని అంతకాపల్లి పంచాయతీ సెక్రటరీ సావిత్రిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం చెప్పారు. ఎమ్మెల్యే కంబాల జోగులు గ్రామస్థుల ఫిర్యాదులను కలెక్టర్ వద్ద ప్రస్తావించినపుడు ఆయన ఈ విషయూన్ని చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు. అయితే అధికారికంగా జిల్లా పంచాయతీ అధికారి నుంచి ఉత్తర్వులు ఇంకా ఆమెకు అందవలసి ఉంది.
‘పచ్చ చొక్కాల చేతిలో రేషన్ కార్డులు’
Published Thu, Feb 25 2016 12:33 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement