
సాక్షి, అమరావతి: రేషన్ కార్డులు కోరుతూ పేదలు మీ సేవాకేంద్రాల్లో ఇచ్చిన దరఖాస్తులను పట్టించుకోరా అంటూ కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ అధికారులను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో పితాని మాట్లాడుతూ ప్రజా సాధికార సర్వేను ఆధారంగా చేసుకుని రియల్ టైం గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారని, దీనివల్ల గతంలోని పేదల దరఖాస్తులను పరిశీలించకపోవడంతో వారు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సీఎం కలుగజేసుకుని.. రేషన్ కార్డులు ఎవ్వరికి రాలేదు? అనవసరంగా మాట్లాడితే ప్రయోజనం ఏముంటుంది? పేదలకు కార్డులివ్వలేదని మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా.. అంటూ మంత్రిపై అసహనం వ్యక్తం చేశారు. మీ తీరు చూస్తుంటే బస్సెక్కి మా ఊరికి టికెట్టివ్వండి అన్నట్టుగా ఉందని.. ఏదైనా మాట్లాడేటప్పుడు కచ్చితమైన వివరాలు దగ్గర పెట్టుకోవాలని చంద్రబాబు సూచించారు.
ఆధారాల్లేకుండా మాట్లాడను : పితాని
దీంతో మంత్రి అదే తరహాలోనే స్పందిస్తూ ఆధారాల్లేకుండా నేను మాట్లాడను సర్.. మీ సే వా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని, రేషన్ కార్డులు మంజూరుకాని పేదల వివరాలిస్తాను. వారికి రేషన్ కార్డులివ్వండి.. అంటూ మంత్రి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment