
సాక్షి, అమరావతి: రేషన్ కార్డులు లేని పేదల నుంచి గ్రామ సచివాలయాల్లో అర్జీలు తీసుకొని విచారణ చేసి అర్హులైన వారికి మూడు రోజుల్లోగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) వెల్లడించారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లబ్ధిదారుల ఇళ్లకే నేరుగా బియ్యాన్ని ప్యాకెట్ల ద్వారా పంపిణీ చేసే కార్యక్రమాన్ని అధికారులంతా బాధ్యతతో నిర్వహించాలని కోరారు.
విజయవాడలో పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని, పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌లు బుధవారం వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సమావేశానికి పౌరసరఫరాల సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.సూర్య కుమారి, వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment