మాజీ ప్రియుడు కంటపడితే...! | Gossip | Sakshi
Sakshi News home page

మాజీ ప్రియుడు కంటపడితే...!

Nov 17 2015 10:54 PM | Updated on Sep 3 2017 12:37 PM

మాజీ ప్రియుడు  కంటపడితే...!

మాజీ ప్రియుడు కంటపడితే...!

లవ్ చేసుకోవడం, బ్రేకప్ అనుకోవడం ఈ రోజుల్లో కామన్. ప్రేమబంధం నుంచి ఎంత తెగతెంపులు చేసుకున్నా,

గాసిప్
 

లవ్ చేసుకోవడం, బ్రేకప్ అనుకోవడం ఈ రోజుల్లో కామన్. ప్రేమబంధం నుంచి ఎంత తెగతెంపులు చేసుకున్నా, కొన్నాళ్ల తర్వాత తన ప్రియుడు లేదా ప్రియురాలు వేరొకరితో కనిపిస్తే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఎదుటివారిని చూడటానికి కూడా ఇష్టపడరు. కాలం ఎంత ఫాస్ట్ అయినా ఈ  ఒక్క విషయంలో మాత్రం మార్పు రాలేదు. కానీ కత్రినా కైఫ్‌కు మాత్రం ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. కైఫ్ బాలీవుడ్‌లో అడుగుపెట్టింది సల్లూ భాయ్ ఆశీస్సులతోనే. ఆ తర్వాత వీరిద్దరూ ఫ్రెండ్స్ నుంచి లవర్స్‌గా మారిపోయారు. ఆ తర్వాత ఏమైందో తెలియదుగానీ, హఠాత్తుగా ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. కొన్నాళ్లకు రణ్‌బీర్ కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది కత్రినాకైఫ్.

ఇప్పుడు వీరిద్దరి ప్రేమ పెళ్లిదాకా వెళుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి కూడా. అయితే ఇంతలో ఏమైందంటే... హీరోయిన్ సోనమ్‌కపూర్ ఇచ్చిన దీపావళి పార్టీకి సల్మాన్‌ఖాన్ హాజరయ్యారు. అంతవరకూ ఓకే. సడన్‌గా ఆ పార్టీకి రణ్‌బీర్-కత్రినా కైఫ్‌లు కూడా రావడంతో అసలు ఏం జరుగుతుందా? అని అక్కడున్న వాళ్లు ఎదురుచూశారు. సల్మాన్‌ను చూసి ఈ జంట షాక్ తిని, ఆ పార్టీలోనే వేరే చోటికి వెళ్లిపోయారు. కానీ సల్మాన్ మాత్రం వెతుక్కుంటూ వెళ్లి మరీ, కత్రినా కైఫ్‌ను పలకరించారట. విచిత్రం ఏమిటంటే పక్కనున్న రణ్‌బీర్‌తో ఒక్కమాట కూడా మాట్లాడలేదట. ఈ వార్త మాత్రం బాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement