
ధ్వంసమైన ఆర్టీసీ బస్సు ముందుభాగం
సాక్షి,ఎచ్చెర్ల క్యాంపస్(శ్రీకాకుళం): కేశవరావుపేట పంచాయతీ కింతలిమిల్లు సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం ఆగి ఉన్న మినీ ట్రాలీలారీని ఆర్డీసీ నాన్‌స్టాప్ బస్సు ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు ప్లాస్టిక్ ఫైపులతో వెళ్తున్న మినీ లారీ మరమ్మతులకు గురై కింతలిమిల్లు వద్ద నిలిచిపోయింది.
ఇదే సమయంలో విశాఖ నుంచి శ్రీకాకుళం వస్తున్న ఆర్టీసీ నాన్‌స్టాప్ బస్సు.. లారీని గమనించక ఢీకొట్టింది. బస్సు ముందుభాగం పూర్తిగా దెబ్బతినగా, అందులో ఉన్న 60 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. భారీ కుదుపులకు కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులను వేరే బస్సులో కాంప్లెస్‌కు తరలించారు. లారీలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అందులోని పైపులు చెల్లాచెదురుగా పడిపోయాయి. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: బెంగాల్ విభజన ఆపేందుకు... రక్తం కూడా చిందిస్తా: మమత
Comments
Please login to add a commentAdd a comment