Woman Gave Birth To Plastic Baby: ఇంతవరకు మనం రకరకాలుగా పుట్టిన వాళ్ల గురించి విన్నాం. అంతేందుకు అవిభక్త కవలలు గురించి విన్నాం. ఇతరత్ర సమస్యలతో పుట్టిన వాళ్ల గురించి కూడా విని ఉంటాం. కానీ ఎప్పుడైన ప్లాస్టిక్ బిడ్డకు జన్మనివ్వడం గురించి విన్నామా!. ఏంటిది కామెడీగా చెబుతున్నాను అనుకోకండి. నిజంగానే ప్లాస్టిక్ బిడ్డే పుట్టింది.
(చదవండి: అందంగా అలంకరించిన ఆ క్రిస్మస్ చెట్టే వాళ్లను జైలుపాలు చేసింది!!)
అసలు విషయంలోకెళ్లితే... ఔరంగాబాద్‌లోని సోహ్డాకు చెందిన ఓ మహిళ సదర్ ఆసుపత్రిలో వింత బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి శరీరం మొత్తం ప్లాస్టిక్‌తో చుట్టి ఉందని తెలిపారు. వైద్య శాస్త్ర భాషలో, అటువంటి పిల్లలను కొల్లాయిడ్ బేబీస్ అంటారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. ఈ మేరకు ఆసుపత్రి వైద్యుడు మాట్లాడుతూ...ప్రపంచంలో పుట్టిన 11 లక్షల మంది శిశువుల్లో ఒకరు కొల్లాయిడ్ బేబీ జన్మిస్తుంటారని తెలిపారు. ప్రసుత్తం ఈ బేబి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంటుందని స్పష్టంగా చెప్పలేం. పైగా ఎంతకాలం వరకు బతుకుతుందో కూడా చెప్పలేం అని అన్నారు.
అయితే తండ్రి స్పెర్మ్‌లో అసాధారణత వల్ల ఇలాంటి బిడ్డ పుడుతుందని ఎస్‌ఎన్‌సీయూ ఇన్‌ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ దినేష్ దూబే చెప్పారు. ఈ మేరకు గత ఏడేళ్లలో అటువంటి పిల్లలు ముగ్గురు జన్మించారని తెలిపారు. అయితే ఇందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మూడో వ్యక్తికి చికిత్స కొనసాగుతోందని అన్నారు. అంతేకాదు ఈ చిన్నారి కూడా ఆరోగ్యవంతంగా ఉండి సాధారణ జీవితం గడపగలదనే భావిస్తున్నాం అని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment