Aurangabad boy
-
వింత జననం: ‘ప్లాస్టిక్ బిడ్డ’కి జన్మనిచ్చిన మహిళ
Woman Gave Birth To Plastic Baby: ఇంతవరకు మనం రకరకాలుగా పుట్టిన వాళ్ల గురించి విన్నాం. అంతేందుకు అవిభక్త కవలలు గురించి విన్నాం. ఇతరత్ర సమస్యలతో పుట్టిన వాళ్ల గురించి కూడా విని ఉంటాం. కానీ ఎప్పుడైన ప్లాస్టిక్ బిడ్డకు జన్మనివ్వడం గురించి విన్నామా!. ఏంటిది కామెడీగా చెబుతున్నాను అనుకోకండి. నిజంగానే ప్లాస్టిక్ బిడ్డే పుట్టింది. (చదవండి: అందంగా అలంకరించిన ఆ క్రిస్మస్ చెట్టే వాళ్లను జైలుపాలు చేసింది!!) అసలు విషయంలోకెళ్లితే... ఔరంగాబాద్‌లోని సోహ్డాకు చెందిన ఓ మహిళ సదర్ ఆసుపత్రిలో వింత బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి శరీరం మొత్తం ప్లాస్టిక్‌తో చుట్టి ఉందని తెలిపారు. వైద్య శాస్త్ర భాషలో, అటువంటి పిల్లలను కొల్లాయిడ్ బేబీస్ అంటారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. ఈ మేరకు ఆసుపత్రి వైద్యుడు మాట్లాడుతూ...ప్రపంచంలో పుట్టిన 11 లక్షల మంది శిశువుల్లో ఒకరు కొల్లాయిడ్ బేబీ జన్మిస్తుంటారని తెలిపారు. ప్రసుత్తం ఈ బేబి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంటుందని స్పష్టంగా చెప్పలేం. పైగా ఎంతకాలం వరకు బతుకుతుందో కూడా చెప్పలేం అని అన్నారు. అయితే తండ్రి స్పెర్మ్‌లో అసాధారణత వల్ల ఇలాంటి బిడ్డ పుడుతుందని ఎస్ఎన్సీయూ ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ దినేష్ దూబే చెప్పారు. ఈ మేరకు గత ఏడేళ్లలో అటువంటి పిల్లలు ముగ్గురు జన్మించారని తెలిపారు. అయితే ఇందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మూడో వ్యక్తికి చికిత్స కొనసాగుతోందని అన్నారు. అంతేకాదు ఈ చిన్నారి కూడా ఆరోగ్యవంతంగా ఉండి సాధారణ జీవితం గడపగలదనే భావిస్తున్నాం అని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. (చదవండి: ఆ సమయంలో కూడా సేవలందించిన సూపర్ ఉమెన్లు) -
చిన్నారి గుండెకి అరుదైన ఆపరేషన్!
ముంబై: అందరికి గుండె చాతీకి ఎడమవైపు ఉంటే, ఆ బాలునికి కుడివైపు ఉంది. అంతేకాక దానికో పెద్ద రంధ్రంతో పాటు, ఊపిరితిత్తులకు వచ్చే ధమనులు కుచించుకుపోయి ఉన్నాయి. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ముంబైలోని సర్.హెచ్.ఎన్.రిలయన్స్ ఫౌండేషన్ హస్పిటల్, రిసర్చ్ సెంటర్ వైద్యులు ఆ బాలునికి వైద్యం చేయడానికి ముందుకొచ్చి ఆ చిన్ని గుండెకు శస్త్రచికిత్స చేసి అందరిలా ఆరోగ్యవంతున్ని చేశారు. ఔరంగాబాద్‌కు చెందిన పేద రైతు కొడుకు సంకేత్ మోరే (6) హృదయ సమస్యలతో ఆసుపత్రిలో చేరగా ఈ నెల 19న బైపాస్ సర్జరీ చేశారు. ‘ఎంతో సంక్లిష్టతో కూడిన శస్త్ర చికిత్సను అనుకున్న సమయానికే మేం పూర్తిచేశాం. మరో వారం రోజుల్లో సంకేత్ ఇంటికి వెళ్తాడు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడ’ని శస్త్ర చికిత్సలో పాల్గొన్న సీనియర్ పిల్లల వైద్యుడు శ్రీపాల్ జైన్ చెప్పారు. చికిత్సకు కోసం రెండు ప్రణాళికలు వేశామని ఒకటి వీలైనంత త్వరగా సర్జరీ పూర్తి చేయడం, రెండు ఊపిరితిత్తులకు ఎటువంటి హాని కలగకుండా ధమనులను సరిచేయడమని ఆయన వివరించారు. ఇందుకోసం బైపాస్ యంత్రాన్ని ఉపయోగించినట్లు తెలిపారు. దేశంలో కొన్ని ఆసుపత్రుల్లోనే ఇలాంటి చికిత్స అందించడానికి సరైన సదుపాయాలున్నాయని జైన్ పేర్కొన్నారు.