
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్య సంచాలకుడి పరిధిలో ఎంబీబీఎస్ అర్హతతో చేప ట్టే సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకాలకు మంగళవారం నుంచి 3 రోజు లపాటు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 27, 28 తేదీల్లో మల్టీజోన్–1కు చెందిన 452 మంది అభ్యర్థులకు, 29న మల్టీజోన్–2కు చెందిన 282 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్ జరగనుంది.
అభ్యర్థులు హైదరాబాద్ వెంగళరావునగర్లోని ఇండియ న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ కార్యాలయంలో హాజరుకావాలి. అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కాకపోతే సుమోటోగా పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేస్తారు. ఎంపిక ప్రక్రియలో పొందిన ర్యాంక్ ఆధారంగా కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. మెరిట్ ప్రకారం కౌన్సెలింగ్ ఉంటుంది కాబట్టి ఎవరు ముందుగా వస్తే వారి ప్రాధాన్యం ప్రకారం పోస్టింగ్‌లు వస్తాయని, పైరవీలను నమ్ముకోవద్దని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment