Civil Assistant Surgeons
-
డాక్టర్ పోస్టులకు కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్య సంచాలకుడి పరిధిలో ఎంబీబీఎస్ అర్హతతో చేప ట్టే సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకాలకు మంగళవారం నుంచి 3 రోజు లపాటు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 27, 28 తేదీల్లో మల్టీజోన్–1కు చెందిన 452 మంది అభ్యర్థులకు, 29న మల్టీజోన్–2కు చెందిన 282 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్ జరగనుంది. అభ్యర్థులు హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని ఇండియ న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ కార్యాలయంలో హాజరుకావాలి. అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కాకపోతే సుమోటోగా పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేస్తారు. ఎంపిక ప్రక్రియలో పొందిన ర్యాంక్ ఆధారంగా కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. మెరిట్ ప్రకారం కౌన్సెలింగ్ ఉంటుంది కాబట్టి ఎవరు ముందుగా వస్తే వారి ప్రాధాన్యం ప్రకారం పోస్టింగ్‌లు వస్తాయని, పైరవీలను నమ్ముకోవద్దని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. -
AP: వైద్య విధాన పరిషత్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ల వేతనాలు పెంపు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విధాన పరిషత్ అసిస్టెంట్ సర్జన్ల వేతనాలను పెంచారు. ప్రస్తుతం ఉన్న రూ.53,000 నుంచి 85,000కి పెంచుతూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: (పప్పులో కాలేసిన పవన్ కళ్యాణ్!) -
ఏపీఎస్ఎఫ్సీ, విజయవాడలో 23 పోస్టులు
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్(ఏపీఎస్ఎఫ్సీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 23 ► పోస్టుల వివరాలు: మేనేజర్లు(ఫైనాన్స్)–09, డిప్యూటీ మేనేజర్లు(ఫైనాన్స్)–03, అసిస్టెంట్ మేనేజర్లు(ఫైనాన్స్)–11. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సీఏ/సీఎంఏ/బీటెక్‌తోపాటు ఎంబీఏ/పీజీడీఎం, బ్యాచిలర్/పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ లా ఇన్ బిజినెస్/కమర్షియల్ లా ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వయసు: 01.08.2021 నాటికి 21ఏళ్ల నుంచి 34ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: ఈ పరీక్షని ఇంగ్లిష్‌లో నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.10.2021 ► వెబ్సైట్: https://esfc.ap.gov.in సీఎఫ్‌డబ్ల్యూ, ఆంధ్రప్రదేశ్‌లో 44 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం(సీఎఫ్‌డబ్ల్యూ).. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► మొత్తం పోస్టుల సంఖ్య: 44 ► అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు ఏపీఎంసీలో రిజిస్టర్ అయి ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 42ఏళ్లు మించకుండా ఉండాలి. ► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గొల్లపూడి, విజయవాడ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021 ► వెబ్సైట్: https://cfw.ap.nic.in -
సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు నేటి నుంచి కౌన్సెలింగ్
ఎన్టీఆర్ హెల్త్‌వర్సిటీలో ఉదయం 10 గంటల నుంచి మొదలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో నియామకాల కోసం సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఏఎస్)లకు బుధవారం నుంచి రెండు రోజులపాటు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కుటుంబ సంక్షేమ శాఖ తన వెబ్సైట్లో ఉంచింది. మొత్తం 1,239 మంది వైద్యులతో తుది జాబితా రూపొందించారు. వీరంతా బుధవారం ఉదయం 10 గంటలకు ఒరిజినల్ ధ్రువపత్రాలతో కౌన్సెలింగ్‌కు రావాల్సి ఉంటుంది. ఎంపిక కమిటీలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, ఆరోగ్య శాఖ డెరైక్టర్, వైద్యవిధాన పరిషత్ కమిషనర్, వైద్యవిద్య డెరైక్టర్ల ఆధ్వర్యంలోనే కౌన్సెలింగ్ జరుగుతుంది. మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తారు.