విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్(ఏపీఎస్‌ఎఫ్‌సీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 23
► పోస్టుల వివరాలు: మేనేజర్లు(ఫైనాన్స్)–09, డిప్యూటీ మేనేజర్లు(ఫైనాన్స్)–03, అసిస్టెంట్ మేనేజర్లు(ఫైనాన్స్)–11.
► అర్హత: పోస్టుల్ని అనుసరించి సీఏ/సీఎంఏ/బీటెక్‌తోపాటు ఎంబీఏ/పీజీడీఎం, బ్యాచిలర్/పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ లా ఇన్ బిజినెస్/కమర్షియల్ లా ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
► వయసు: 01.08.2021 నాటికి 21ఏళ్ల నుంచి 34ఏళ్ల మధ్య ఉండాలి.
► ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
► పరీక్షా విధానం: ఈ పరీక్షని ఇంగ్లిష్‌లో నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.10.2021
► వెబ్‌సైట్: https://esfc.ap.gov.in
సీఎఫ్‌డబ్ల్యూ, ఆంధ్రప్రదేశ్‌లో 44 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం(సీఎఫ్‌డబ్ల్యూ).. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
► మొత్తం పోస్టుల సంఖ్య: 44
► అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు ఏపీఎంసీలో రిజిస్టర్ అయి ఉండాలి.
► వయసు: 01.07.2021 నాటికి 42ఏళ్లు మించకుండా ఉండాలి.
► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గొల్లపూడి, విజయవాడ చిరునామకు
పంపించాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021
► వెబ్‌సైట్: https://cfw.ap.nic.in
Comments
Please login to add a commentAdd a comment