ఎంబీబీఎస్‌ ప్రాథమిక మెరిట్‌ జాబితా విడుదల | MBBS Preliminary Merit List Released | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్‌ ప్రాథమిక మెరిట్‌ జాబితా విడుదల

Published Fri, Aug 18 2023 3:16 AM | Last Updated on Fri, Aug 18 2023 8:54 AM

MBBS Preliminary Merit List Released - Sakshi

సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్‌ కోర్సులలో ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లలో 2023–24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రాథమిక మెరిట్‌ జాబితాను వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసింది. దీంతోపాటు ఈ ఏడాది కొత్తగా ప్రారంభిస్తున్న 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జాబితాను విడుదల చేశారు.

విద్యార్థులు తమ అభ్యంతరాలు, వినతు­లను https://ugmq.ysruhs.com/ Grievance/ index. php  వెబ్సైట్‌ లో శుక్రవారం సాయంత్రం 4 గంటలలోగా నమోదు చేయాల్సి ఉంటుంది. గడువు ముగిసిన అనంతరం నమోదు చేసిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోబోమని రిజిస్ట్రార్‌ రాధికారెడ్డి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement