సడెన్‌గా సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన శ్రీలీల.. కారణం ఇదే! | Sreeleela Taking A Small Break From Movie Shooting; Here's The Reason | Sakshi
Sakshi News home page

Sreeleela : సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన శ్రీలీల.. కారణం ఇదే!

Published Tue, Dec 19 2023 4:25 PM | Last Updated on Tue, Dec 19 2023 5:27 PM

Sreeleela Taking A Small Break From Movie Shooting, Here The Reason - Sakshi

వరుస సినిమాలతో దూసుకెళ్తోంది యంగ్‌ బ్యూటీ శ్రీలీల. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ బిజియెస్ట్‌ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఈ ఏడాది ఇప్పటికే స్కంద, భగవంత్‌ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ ఏడాది ఆమె నటించిన చిత్రాల్లో ఒక్క భగవంత్‌ కేసరి తప్ప మిగతావన్నీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో శ్రీలలకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

ఇప్పుడు ఆమె ఆశలన్నీ ‘గుంటూరు కారం ’మీదే ఉన్నాయి. మహేశ్‌ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్‌ ఇంకా కొనసాగుతుంది. దీంతో పాటు పాటు మరో రెండు సినిమాల్లోనూ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇలా షూటింగ్‌, ప్రమోషన్స్‌తో బిజీగా ఉండే శ్రీలీల.. సడన్‌గా సినిమాకు బ్రేక్‌ ఇచ్చింది. కొద్ది రోజుల పాటు ఆమె సినిమాలకు దూరంగా ఉండనుంది. దానికి బలమైన కారణం ఉంది. 

శ్రీలల యాక్టర్‌ మాత్రమే కూడా డాక్టర్‌ కూడా కాబోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎంబీబీఎస్‌ చదువుతోంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన వైద్యవిద్యను పూర్తి చేస్తోంది. త్వరలోనే శ్రీలీలకు ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రాయబోతుంది. ఈ నెల 18 నుంచి 24 వరకు ఫైనల్‌ ఇయర్‌ ఎగ్జామ్స్‌  ఉన్నాయి. దాని కోసమే శ్రీలీల ముంబై వెళ్లారట. పరీక్షలు పూర్తయ్యే వరకు శ్రీలీల ఏ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొనరట. అధికారికంగా ఎక్కడ చెప్పకపోయినా.. సోషల్‌ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్‌ అవుతోంది.

శ్రీలీల తల్లి కూడా వైద్యురాలే. కూతురు కెరీర్‌ కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేసి అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది. శ్రీలీలకు కూడా డాక్టర్‌గా కొనసాగడడమే ఇష్టం. అందుకే ఎంబీబీఎస్‌ తర్వాత కూడా చదువును కంటిన్యూ చేయాలనుకోంటోంది. హాయ్యర్‌ స్టడీస్‌ కోసం ప్లాన్‌ చేస్తోనట్లు సమాచారం. ఒకవేళ అదే  నిజమైతే ఇకపై శ్రీలీల సినిమాల్లో నటించడం కష్టమే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement