
మహబూబాబాద్: కాజీపేట పట్టణంలో ఓ సైకో గొంతు కోసుకుని వీరంగం సృష్టించాడు. బిహార్‌కు చెందిన అమర్ చౌహాన్ ( 30) మిత్రులతో కలిసి బుధవారం రైలులో కాజీపేట జంక్షన్ చేరుకున్నాడు. అనంతరం సహచరులతో కలిసి గంజాయి సేవించి వారితోనే గొడవకు దిగాడు. జేబులో ఉన్న కత్తితో గొంతు కోసుకోవడంతో దుస్తులన్నీ రక్తసిక్తమయ్యాయి. హిందీలో బాటసారులను దూషిస్తూ దౌర్జన్యంగా ప్రవర్తించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 108లో చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment