
శ్రీనివాసులు (ఫైల్)
మహబూబ్‌నగర్: మండలంలోని దారారం చెందిన ఆవుల శ్రీనివాసులు(43) ఆత్యహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆవుల శ్రీనివాసులు శుక్రవారం కుటుంబసభ్యులకు తెలియకుండా ఇంటి నుంచి వెళ్లి పోయాడు. వ్యక్తి గురించి కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు.
గ్రామానికి సమీపంలో ఉన్న పచ్చగట్టు వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా గమనించిన కొంతమంది కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి కొంతకాలంగా కడుపునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు ఉండడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి: వివాహేతర సంబంధమే కారణమా..?